నా వల్లే మోదీ సర్కార్‌ వెనక్కి తగ్గింది! | Provident Fund Tax Scheme Cancelled Because Of Me, Says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

నా వల్లే మోదీ సర్కార్‌ వెనక్కి తగ్గింది!

Mar 8 2016 3:20 PM | Updated on Sep 3 2017 7:16 PM

నా వల్లే మోదీ సర్కార్‌ వెనక్కి తగ్గింది!

నా వల్లే మోదీ సర్కార్‌ వెనక్కి తగ్గింది!

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఉపసంహరణపై పన్ను విధించాలన్న వివాదాస్పద నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపసంహరించుకుంది.

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఉపసంహరణపై పన్ను విధించాలన్న వివాదాస్పద నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. తన ప్రయత్నాలు, ఒత్తిడి వల్లే మోదీ సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు.

'మధ్యతరగతి ప్రజల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూసింది. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాలని నేను నిర్ణయించాను. నా ఒత్తిడి పనిచేసింది' అని 45 ఏళ్ల రాహుల్‌ పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణ 40శాతం మించితే పన్ను విధిస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను తప్పపడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాహుల్‌ విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. మధ్య తరగతి ఉద్యోగులు, కార్మికుల నుంచి కూడా ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతికేత వ్యక్తమైంది. దీంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌ పై అసంబద్ధమైన పన్ను విధించాలనుకున్న కేంద్రం ప్రజల మాట వినేలా ఒత్తిడి తెచ్చామని, ఈ ప్రభుత్వానికి ప్రజావ్యతిరేక ధోరణి అని రాహుల్‌ విరుచుకుపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement