ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక | Priyanka Chopra is the 8th highest paid TV actress on Forbes 2016 list | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక

Sep 16 2016 2:07 AM | Updated on Sep 4 2017 1:37 PM

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక

ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ మేగజీన్ ఈఏడాదికిగాను ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న టీవీ నటీమణుల జాబితాలోబాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్థానం సంపాదించింది.

అత్యధిక సంపాదన ఉన్న టీవీ స్టార్లలో ఎనిమిదో స్థానం 

 న్యూయార్క్: ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ మేగజీన్ ఈఏడాదికిగాను ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న టీవీ నటీమణుల జాబితాలోబాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్థానం సంపాదించింది. 15 మంది ఉన్న ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచిన ప్రియాంక... ఈ ఘనత సాధించిన తొలి భారతీయనటిగా రికార్డు సృష్టించింది. అమెరికా టీవీ షో క్వాంటికో ద్వారా గతేడాది అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన ప్రియాంక దాదాపు రూ.73.72 కోట్లు (11 మిలియన్ డాలర్లు) సంపాదించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. అమెరికా నటి సోఫియా వెర్గారా రూ.288.18 కోట్ల (43 మిలియన్ డాలర్లు)తో వరుసగా ఐదోసారీ తొలిస్థానంలో నిలిచింది.

సూపర్ హిట్ టీవీ షో... మోడరన్ ఫ్యామిలీలో వెర్గారా చేస్తోంది. వీటితో పాటు ఎండార్స్‌మెంట్లు తదితరాల ద్వారా ఇంత మొత్తాన్ని సంపాదించింది. రూ.160.84 కోట్ల ఆదాయంతో కాలె కువాకో, రూ.100.53 కోట్లతో మిన్డీ కాలింగ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రూ.97 కోట్ల చొప్పున ఎలెన్ పాంపియో, మరిస్కా హర్గిటే సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. శాండల్ నటి కెర్రీ వాషింగ్టన్ (రూ.90.47 కోట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. అయితే... హాలీవుడ్‌లో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల సంపాదనలో ఎంతో వ్యత్యాసం ఉందని, దీన్ని వారు చేరుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉందని మేగజీన్ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement