కేరళ ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ లో నిర్వహిస్తున్న కైరాలీ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నట్లు రాష్ట్రపతి సచివాలయం ప్రకటించింది.
న్యూఢిల్లీః రాష్ట్రపతి భవన్ లో శనివారం జరిగే ఓనం వేడుకలకు ప్రముఖ అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరు కానున్నారు. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న కైరాలీ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకానున్నట్లు రాష్ట్రపతి సచివాలయం ప్రకటించింది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు సహా సాయంత్రం నిర్వహించే కార్యక్రమానికి అతిథులుగా హాజరు కానున్నారు. కేరళ గవర్నర్ పి. సదాశివం, ముఖ్యమంత్రి పినారయి విజయన్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఓనం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో కేరళ సంగీత నృత్య రూపాలైన వద్యం, మోహినీఅట్టం, కథకళి వంటివి.. ప్రత్యేకాకరర్షణలుగా నిలవనున్నాయి. ఓనం పండుగను చిత్రీకరిస్తూ.. ప్రత్యేక దర్శకత్వంలో నిర్వహించే సాంస్కృతిక కళారూపాలైన ఒప్పన, మయూర నృతం, తెయ్యం, కలారీ, కేరళ నటనం, తిరువతిర తో పాటు మర్గం కాళి ప్రదర్శనలు.. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఓనం వేడుకల్లో ఆహూతులను అలరించనున్నాయి. ఈ సంవత్సరం ఓనం పండుగ సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జరుపుకోనున్నారు.