
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా నూతనంగా ఎన్నికైన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్(67) శుక్రవారం 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరుగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహా్వన లేఖలు పంపినట్లుగా తెలిసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగా సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయగా, దానిని రాష్ట్రపతి ఆమోదించారు.