యూపీఎస్సీ సభ్యుడిగా ప్రదీప్ కుమార్ జోషీ | Pradeep Kumar Joshi appointed UPSC member | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ సభ్యుడిగా ప్రదీప్ కుమార్ జోషీ

May 12 2015 1:51 AM | Updated on Sep 3 2017 1:51 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషీ సోమవారం నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషీ సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్‌గా దీపక్ గుప్తా వ్యవహరిస్తుండగా, కమిషన్‌లో 10మంది సభ్యులకు గాను తొమ్మిది మందే ఉ న్నారు. జోషీ నియామకంతో మొత్తం సభ్యుల నియామకం పూర్తయింది.

జోషీ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్నా రు. యూపీఎస్సీలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జోషీ పదవీకాలం మొదలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement