ముఖ్యమంత్రి ఇంటికి బాంబు బెదిరింపు | Pondicherry CM House Receives Hoax Bomb Threat Call | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి ఇంటికి బాంబు బెదిరింపు

Apr 1 2018 9:48 PM | Updated on Apr 1 2018 10:09 PM

Pondicherry CM House Receives Hoax Bomb Threat Call - Sakshi

సాక్షి, చెన్నై : పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి సీఎం ఇంట్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు ఫోన్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నారాయణ స్వామి ఇంటిని అడుగడుగున క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పందంగా ఏమీలేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆకతాయిలు చేసిన బెదిరింపులుగా గుర్తించారు. అంతేకాకుండ ఫోన్‌ చేసిన ఆకతాయిలను పట్టుకొనేందుకు గాలింపులు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement