పోలీసుల తనిఖీల్లో పాత నోట్లు. | police seize old notes worth Rs 15.30 lakh | Sakshi
Sakshi News home page

పోలీసుల తనిఖీల్లో పాత నోట్లు.

Feb 21 2017 7:27 PM | Updated on Sep 5 2017 4:16 AM

రద్దయిన పాత నోట్లతో కారులో వెళ్తున్న నలుగురిని నగర పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

ఘజియాబాద్‌: రద్దయిన పాత నోట్లతో కారులో వెళ్తున్న నలుగురిని నగర పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 15 లక్షల 30 వేల పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కుశంబి పట్టణ సమీపంలో జరిగింది. ఢిల్లీ రిజి‍స్ట్రేషన్‌ నెంబర్‌ కల్గిన సాంట్రో కారును తనిఖీ చేయగా ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో పాత నోట్లు లభ్యమయ్యాయని ఆదాయపన్నుశాఖ అధికారులకు సమాచారం అందించామని, నగర ఏస్పీ సల్మాన్‌ తాజ్‌ పాటిల్‌ తెలిపారు.
 
కారులో ఉన్న నలుగురిని విచారించి వారి వాంగ్మూలం తీసుకున్నామని, ఆదాయ శాఖ అధికారులు నోట్లు ఎందుకు మార్చుకోలేదో నిర్ధారించేవరకు వీరిని అదుపులో ఉంచుకుంటామని చెప్పారు. పాత రూ.500 రూ.1000 నోట్లను మోదీ ప్రభుత్వం  రద్దుచేసిన విషయం తెలిసిందే. నోట్ల మార్పు గడువు గతేడాది డిసెంబర్‌ 31నే ముగిసింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement