ఈ చేపలు చాలా డేంజర్‌ గురూ!

Poisonous Scorpion Fishes Discovered In Tamil Nadu Sea - Sakshi

చెన్నై ‌: రామనాథపురం జిల్లా సేతుకరై సముద్రతీరంలో అరుదైన విషపూరిత తేలు చేపలు వెలుగులోకి వచ్చాయి. మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతంలో ఈ అరుదైన సముద్ర జలచరాలు జీవిస్తున్నాయి. ప్రపంచంలో వేరెక్కడా లేని విధంగా చేపలు, సముద్రపు పశువులు సహా నాలుగువేలకు పైగా అరుదైన జలచరాలు జీవిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా ప్రకటించి పర్యవేక్షణ జరుపుతున్నారు. ఇలా ఉండగా కేంద్ర మత్స్యశాఖ పరిశోధన సీనియర్‌ సైంటిస్టు జయభాస్కరన్‌ ఆధ్వర్యంలో పరిశోధక బృందం మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతంలో సోమవారం పరిశీలనలు జరపగా తిరుపుల్లాని సమీపంలోని సేతుకరై సముద్ర ప్రాంతంలో మృతి చెందిన స్థితిలో తేలు చేపలు కనిపించాయి. వీటిని పరిశోధనల నిమిత్తం వెలికి తీశారు. ఇవి తరచుగా రంగులు మార్చే చేపలుగా జయభాస్కరన్ పేర్కొన్నారు. ఇవి మనిషిని కుడితే లేదా ఈ చేపలను ఆరగిస్తే శరీరంలో విషం వ్యాపించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నట్లు తెలిపారు.

చదవండి : హెయిర్‌కట్‌కు ఆధార్‌ తప్పనిసరి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top