చౌకీదార్‌ క్యాంపెయిన్‌ : ప్రొఫెషనల్స్‌కు ప్రధాని ఆహ్వానం | PM Modi Specially invites Professionals To Join Chowkidar Campaign | Sakshi
Sakshi News home page

చౌకీదార్‌ క్యాంపెయిన్‌ : ప్రొఫెషనల్స్‌కు ప్రధాని ఆహ్వానం

Mar 24 2019 5:48 PM | Updated on Mar 24 2019 5:48 PM

PM Modi Specially invites Professionals To Join Chowkidar Campaign - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చౌకీదార్‌ క్యాంపెయిన్‌లో విరివిగా పాల్గొన్నాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రొఫెషనల్స్‌ను అభ్యర్ధించారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారని..మీ ప్రయత్నాలతో దేశం ఆరోగ్యకరంగా, సుసంపన్నంగా, విద్యాపరంగా సరికొత్త శిఖరాలకు చేరుకుంటుంద’ని ప్రధాని వ్యాఖ్యానించారు.

‘ప్రియమైన వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, అధ్యాపకులు, ఐటీ ప్రొఫెషనల్స్‌, బ్యాంకర్లు సహా వివిధ వృత్తి నిపుణులు మైబీ చౌకీదార్‌ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నా’మని ప్రధాని ఆదివారం పలు వృత్తి నిపుణులను కోరుతూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. కాగా గతవారం ప్రధాని మోదీ తాను చేపట్టిన నేనూకాపలాదారు కార్యక్రమంలో పార్టీ నేతలను పాల్గొనాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.

ప్రధాని పిలుపుతో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు ట్విటర్‌లో తమ పేర్ల ముందు చౌకీదార్‌ పదాన్ని జోడించారు. కాగా ప్రధాని చౌకీదార్‌ క్యాంపెయిన్‌ను విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement