ఆ టెకీలపై ప్రధాని మోదీ ప్రశంసలు

PM Modi Lauds Young Achievers For Creating New India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నవ భారత్‌ ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. విద్యార్ధులు, యువతరం విద్యా సముపార్జనకు, కెరీర్‌ మెరుగుపరుచుకునేందుకు సన్నద్ధమయ్యే తరుణమిదని మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూపీలోని రాయ్‌బరేలికి చెందిన ఇద్దరు యువ ఐఐటీ ప్రొఫెషనల్స్‌ తమ నైపుణ్యాలను ఉపయోగించి ‘స్మార్ట్‌ గావ్‌’ యాప్‌ రూపొందించడాన్ని ప్రస్తావించిన ప్రధాని వారిని అభినందించారు.

భారత్‌ మూలాల్లోనే వినూత్న ఆవిష్కరణలను రూపొందించే సత్తా ఉందన్నారు. మన నైపుణ్యాలకు పదునుపెట్టే దిశగా మరిన్ని విజయగాథలు వెలుగు చూడాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో యువత ఎన్నో అవాంతరాలు, అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తున్నారని సోదాహరణంగా వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో యువతరం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ దేశంలో ఏ మూల ఏ ఒక్కరి విజయగాధైనా తనలో ఉత్తేజం నింపుతుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top