గంగా నదిలో ప్రధాని మోదీ పడవ ప్రయాణం

PM Modi Boat Ride In Ganga To Visit Namami Gange Project Works - Sakshi

కాన్పూర్‌ : ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో శనివారం పవవ ప్రయాణం చేశారు. కాన్పూర్‌లోని అటల్‌ ఘాట్‌ నుంచి మొదలైన ఈ ప్రయాణంలో ప్రధానితోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ (సీఎం నితీష్‌కుమార్‌ స్థానంలో) ఉన్నారు. ప్రతిష్టాత్మక నమామి గంగా కార్యక్రమంలో భాగంగా గంగా ప్రక్షాళనకు జరుగుతున్న పనులను ప్రధాని పర్యవేక్షించారు.

తొలిసారిగా జరుగుతున్న నేషనల్‌ గంగా కౌన్సిల్‌ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. గంగా ప్రక్షాళన తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రధాని మోదీ కాన్పూర్‌లో పర్యటిస్తున్నారని పీఎంఓ కార్యాలయం ట్విటర్‌లో పేర్కొంది. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి కాన్పూర్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కాగా, నమామి గంగా ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేసి గంగా నదిని శుద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top