పీఎఫ్ ఉపసంహరణ చట్టాలు కఠినతరం | PF withdrawal tightened laws | Sakshi
Sakshi News home page

పీఎఫ్ ఉపసంహరణ చట్టాలు కఠినతరం

Feb 26 2016 2:14 AM | Updated on Sep 3 2017 6:25 PM

పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ నిబంధనల్ని ఈపీఎఫ్‌వో కఠినతరం చేసింది. నిబంధనల ప్రకారం 54 సంవత్సరాలు వచ్చే వరకూ పీఎఫ్ సొమ్ము తీసుకునేందుకు వీలులేదు.

న్యూఢిల్లీ: పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ నిబంధనల్ని ఈపీఎఫ్‌వో కఠినతరం చేసింది.  నిబంధనల ప్రకారం 54 సంవత్సరాలు వచ్చే వరకూ పీఎఫ్ సొమ్ము తీసుకునేందుకు వీలులేదు. ఈ వయసును 57కు పెంచామని కార్మిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.  ఈ సొమ్ము ఎల్‌ఐసీకి బదిలీచేసి వరిష్ఠ పెన్షన్ బీమా యోజనలో పెట్టుబడి పెట్టనున్నారు.

కొన్ని సంస్థల్లో పదవీవిరమణ వయసు 55 లేదా 56గా ఉండడంతో 54 ఏళ్లకు 90 శాతం సొమ్ము తీసుకునేందుకు అనుమతించేవారు. ఏడాదిలోపు పీఎఫ్ సొమ్ము బ్యాంకు ఖాతాకు జమచేసేవారు. ప్రస్తుతం అన్నిచోట్లా పదవీవిరమణ వయసు 58 ఏళ్లకు పెంచడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement