
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.
ముంబై: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెట్రోల్ ధర లీటరుకు 1.23 రూపాయలు, డీజిల్ పై 0.89 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో నేటి అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమలు కానున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో నెలకొంటున్న తీవ్ర అనిశ్చితి కారణంగా రోజుకు ఒకసారి ధరలను సమీక్షించాలని ఆయిల్ కంపెనీలు ఇటీవల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.