నెమలి సోయగం.. అద్భుతమైన వీడియో!

Peacock Flying In Ranthambore Video Twitter Says Amazing - Sakshi

నెమలి ఇలాగే ఎగురుతుంది మరి!

అటవీ శాఖ అధికారి సుశాంత నందా సోషల్‌ మీడియాలో అరుదైన వీడియోలు షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా.. అందమైన ఈకలను రెపరెపలాడిస్తూ నెమలి చెట్టుపైకి ఎగురుతున్న అద్భుత దృశ్యాలు చూసే అవకాశం తన ఫాలోవర్లకు కల్పించారు. ‘‘నెమలి ఇలాగే ఎగురుతుంది. దాని తోకలోని ఈకలు దాదాపు ఆరు అడుగుల పొడవు ఉంటాయి. శరీరం పొడవు కంటే అవే 60 శాతం ఎక్కువ’’అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోకు వారంతా ఫిదా అవుతున్నారు.(ఇళ్ల ముందు నుంచే క‌నిపిస్తున్న మంచుకొండ‌లు)

ఇక ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్‌ సాధించిన ఆ వీడియో రాజస్తాన్‌లోని రణతంబోర్‌ జాతీయ పార్కులో తీశారు. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ హర్షా నరసింహమూర్తి గతేడాది తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించారు. రెండు నెమళ్లు నడుస్తూ వెళ్తుండగా... అందులో ఒకటి తన పింఛం సోయగాన్ని ప్రదర్శిస్తూ ఓ కొమ్మపై వాలింది. ఈ అద్భుత వీడియోను చూసిన నెటిజన్లు హర్షతో పాటు అతడి వీడియోను షేర్‌ చేసినందుకు సుశాంత్‌ నందాను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి.(‘ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటేన్’‌.. ఇవి అందమైనవి!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top