తుపాకీ గుండుతో దొరికిన ప్రయాణికుడు! | Passenger with bullet held at airport | Sakshi
Sakshi News home page

తుపాకీ గుండుతో దొరికిన ప్రయాణికుడు!

Nov 22 2014 11:26 AM | Updated on Sep 2 2017 4:56 PM

ఓ ప్రయాణికుని లగేజీలో తుపాకీ గుండు లభించడంతో తిరువనంతపురం విమానాశ్రనయంలో కలకలం రేపింది.

తిరువనంతపురం:ఓ ప్రయాణికుని లగేజీలో తుపాకీ గుండు లభించడంతో తిరువనంతపురం విమానాశ్రయంలో కలకలం రేపింది. శివ అనే ప్రయాణికుడు దమ్మమ్ కు వెళ్లే క్రమంలో లగేజీ చెక్ చేస్తుండగా తుపాకీ గుండు దొరికింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు పోలీసులకు అప్పగించారు.

 

ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాను తమిళనాడులోని కొవిళ్ పట్టి కి చెందిన వాడినని,  ఆ బుల్లెట్ ను తన స్నేహితుడు ఇచ్చాడని అతను పోలీసులకు తెలిపాడు. అయితే అతని వ్యాఖ్యలకు సంబంధించి తగిన ఆధారాలు ఏమీ లేవని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement