మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్ | Pakistan Army violates ceasefire on LoC in Kashmir | Sakshi
Sakshi News home page

మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్

Sep 29 2016 10:59 AM | Updated on Sep 4 2017 3:31 PM

పాకిస్థాన్ ఆర్మీ తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది.

శ్రీనగర్ : పాకిస్థాన్ ఆర్మీ తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. తాజాగా గురువారం ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని నౌగమ్ సెక్టర్పైకి కాల్పులు జరిపాయి. సెక్టర్లోని దనిష్, లక్ష్మీ పోస్టులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి.  అయితే వెంటనే స్పందించిన... భారత ఆర్మీ కూడా ఎదురు కాల్పులకు దిగింది. ఇరువైపులా కాల్పులు హోరా హోరీగా సాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement