తీహార్‌ జైల్లో చిద్దూ; తొలిరోజు గడిచిందిలా..

P Chidambaram Spends Restless First Night at Tihar Jail - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తీహార్‌లోని జైలులో మొదటిరోజు నిద్రలేని రాత్రి గడిపారు. కొత్త వాతావరణంలో సరిగా నిద్రపోలేకపోయారు. కోర్టు ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీ పెంచడంతో ఆయనను గురువారం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించారు. తన కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన ఏడో నంబరు జైలు గదిలోనే ఆయన్ని ఉంచారు. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు 74 ఏళ్ల చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించి కొన్ని సదుపాయాలు కల్పించారు.

గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత తలగడ, దుప్పటి అందజేశారు. జైలు గది బయట వాకింగ్‌ చేసేందుకు శుక్రవారం ఉదయం ఆయనకు అధికారులు అనుమతిచ్చారు. తర్వాత అల్పాహారం, తేనీరు అందించారు. అల్పాహారంగా అంబలి తీసుకున్నట్టు సమాచారం. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా లైబ్రరీని వాడుకోవచ్చనీ, నిర్దేశిత సమయంలో టీవీ చూడవచ్చని జైలు అధికారులు వెల్లడించారు. దినపత్రికలు కూడా అందిస్తామన్నారు. ఈరోజు చిదంబరాన్ని ఆయన న్యాయవాది జైలులో కలిసే అవకాశముందని వెల్లడించారు. (చదవండి: తీహార్‌ జైలుకు చిదంబరం)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top