ఎవరు పడితే వాళ్లు టాక్సీలు ఎక్కడానికి అనుమతించేది లేదంటూ హిమాచల్ ప్రదేశ్ సర్కారు ఉత్తర్వులిచ్చింది.
ఎవరు పడితే వాళ్లు టాక్సీలు ఎక్కడానికి అనుమతించేది లేదంటూ హిమాచల్ ప్రదేశ్ సర్కారు ఉత్తర్వులిచ్చింది. కేవలం వృద్ధులు, వికలాంగులను మాత్రమే అక్కడి టాక్సీలు ఎక్కేందుకు అనుమతిస్తారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిబంధనలు ఉన్న రోడ్లలో ఈ నియమాలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్ రోడ్డురవాణా కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ) టాక్సీల విషయంలో ఈ నిబంధన అమలవుతుంది. నిషిద్ధ ప్రాంతాల్లో హెచ్ఆర్టీసీ టాక్సీలు కూడా మామూలు టాక్సీల్లా ఎలా పడితే అలా తిరుగుతున్నాయంటూ హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అహ్మద్ మీర్, జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్-లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు, పదేళ్లలోపు పిల్లలు మాత్రమే హెచ్ఆర్టీసీ టాక్సీలు ఎక్కేందుకు వీలుంటుందని తెలిపింది. పర్యావరణ సమస్యల దృష్ట్యా కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.