‘మీ అవసరం లేదు.. పాక్‌తోనే తేల్చుకుంటాం’

Only Bilateral Talks On Kashmir India Says To America - Sakshi

కశ్మీర్‌ అంశంపై అమెరికాకు స్పష్టం చేసిన భారత్‌

న్యూఢిల్లీ : కశ్మీర్‌ అంశంపై భారత ప్రధాని మోదీ తన సాయం కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో కశ్మీర్‌ అంశంపై ఎలా ముందుకెళ్తారో భారత్‌, పాకిస్తాన్‌ ఇష్టమని గురువారం పేర్కొన్నారు. అయితే, కశ్మీర్‌ అంశంపై ఒకవేళ సాయం కోరితే మాత్రం తప్పకుండా ముందుకొస్తానని మరోసారి స్పష్టం చేశారు.

కాగా ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కశ్మీర్‌ అంశంపై ఇతరుల జోక్యం అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియోతో జరిగిన భేటీలో ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక చర్చల్లో ఇతరుల మధ్యవర్తిత్వం అనుమతించబోమని తేల్చి చెప్పారు. కశ్మీర్‌ విషయంలో ఎలాంటి చర్చలైనా కేవలం పాకిస్తాన్‌తో మాత్రమే ఉంటాయని ట్విటర్‌లో వెల్లడించారు.
(చదవండి : కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top