ఢిల్లీలో కిలో ఉల్లి రూ.23

Onion price at Rs 23 per kg in Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఉల్లి ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ వాసులకు ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. మార్కెట్‌ రేటుతో పోలిస్తే సగానికే ఉల్లిని అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 28 నుంచి కిలో ఉల్లిపాయలను రూ.23.90కే విక్రయించనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

రాష్ట్రంలోని 400 రేషన్‌ షాపులతోపాటు 70 మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా ఉల్లిని ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం రానున్న 5 రోజుల్లో కేంద్రం నుంచి సుమారు లక్ష కిలోల ఉల్లిపాయలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని పరిమితులతో మాత్రమే వీటిని కొనుగోలు చేయగలరు. ఒక వ్యక్తికి ఒకసారి కేవలం 5 కిలోల ఉల్లిపాయలను మాత్రమే విక్రయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 దాకా పలుకుతోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top