పోలీస్ స్టేషన్పై గ్రెనెడ్తో దాడి | One police killed in a terrorist attack on a police station in Kulgam district | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్పై గ్రెనెడ్తో దాడి

Jul 15 2016 7:11 PM | Updated on Sep 4 2017 4:56 AM

జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ విరుచుపడ్డారు. కుల్గాం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు గ్రెనేడ్తో దాడి చేశారు.

శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ విరుచుపడ్డారు. కుల్గాం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు గ్రెనేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీస్ మరణించగా, మరో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

జమ్ము కశ్మీర్లో ఇటీవల భద్రత బలగాలు హిజ్బుల్ కమాండర్ బుర్హాన్తో అతని ఇద్దరు సహాయకులను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటువాదులు బంద్కు పిలుపునివ్వడం, నిరసనకారులు ఆందోళనకు దిగడంతో హింస చెలరేగింది. దాదాపు 30 మంది మరణించారు. పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement