రైల్వే ప్రయాణికులకు ఊరట

Raiway Ticket Counter

న్యూఢిల్లీ: ప్రయాణికులకు మరోసారి రైల్వే శాఖ కల్పించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే రైల్వే ఈ–టికెట్లపై సేవా రుసుము మినహాయింపును వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించింది. గత ఏడాది నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు ఆన్‌లైన్‌ లావాదేవీలను పెంచేందుకు ఈ–టికెట్లపై సేవా రుసుముకు కేంద్రం తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. తాజాగా ఈ మినహాయింపును 2018 మార్చి 31వరకు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసే రైలు టికెట్లపై రూ.20 నుంచి రూ.40 వరకు గతంలో సేవా రుసుం వసూలు చేశారు.

నిరుడు ఐఆర్‌సీటీసీకి టికెట్ల అమ్మకంతో రూ.1500 కోట్ల ఆదాయం రాగా దీనిలో రూ.540 కోట్లు కేవలం సేవా రుసుముల ద్వారా వచ్చింది. 2016 నవంబరు 23 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు ప్రయాణికుల నుంచి సేవా రుసుం, సేవా పన్ను రూపంలో రూ.184 కోట్లు వసూలు చేయకుండా వదిలేసినట్లు రైల్వే గణాంకాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top