breaking news
service charge waiver
-
రైల్వే ప్రయాణికులకు ఊరట
-
రైల్వే ప్రయాణికులకు ఊరట
న్యూఢిల్లీ: ప్రయాణికులకు మరోసారి రైల్వే శాఖ కల్పించింది. ఆన్లైన్లో కొనుగోలు చేసే రైల్వే ఈ–టికెట్లపై సేవా రుసుము మినహాయింపును వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించింది. గత ఏడాది నవంబర్లో పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు ఆన్లైన్ లావాదేవీలను పెంచేందుకు ఈ–టికెట్లపై సేవా రుసుముకు కేంద్రం తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. తాజాగా ఈ మినహాయింపును 2018 మార్చి 31వరకు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసే రైలు టికెట్లపై రూ.20 నుంచి రూ.40 వరకు గతంలో సేవా రుసుం వసూలు చేశారు. నిరుడు ఐఆర్సీటీసీకి టికెట్ల అమ్మకంతో రూ.1500 కోట్ల ఆదాయం రాగా దీనిలో రూ.540 కోట్లు కేవలం సేవా రుసుముల ద్వారా వచ్చింది. 2016 నవంబరు 23 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు ప్రయాణికుల నుంచి సేవా రుసుం, సేవా పన్ను రూపంలో రూ.184 కోట్లు వసూలు చేయకుండా వదిలేసినట్లు రైల్వే గణాంకాలు వెల్లడించాయి. -
ఈ-టికెట్ బుకింగ్లకు ఐఆర్సీటీసీ ఆఫర్
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎలక్ట్రానిక్ చెల్లింపులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఐఆర్సీటీసీ ఓ సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. టికెట్ కౌంటర్ల వద్దకు వెళ్లి నేరుగా నగదు చెల్లించేవారు కాకుండా, ఐఆర్సీటీసీ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈనెల 23వ తేదీ.. బుధవారం నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసు చార్జీ మినహాయింపు ఇచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో ఈ టికెట్లు లేదా ఐ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేవారు ఆ టికెట్ల మీద సర్వీసు చార్జీని చెల్లించాల్సిన అవసరం ఉండదన్న మాట. ప్రస్తుతం స్లీపర్/ సెకండ్ క్లాస్ టికెట్ల మీద ఒక్కో టికెట్కు రూ. 20, ఏసీ టికెట్ల మీద రూ. 40 చొప్పున సర్వీస్ టాక్స్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. బేసిక్ ఫేర్తో పాటు రిజర్వేషన్ ఫీజు, సంబంధిత బ్యాంకు వసూలుచేసే అదనపు చార్జీలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి సర్వీసు చార్జి మినహాయింపు వచ్చింది. తర్వాత క్రమంగా బ్యాంకులు వసూలుచేసే గేట్వే చార్జీలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది.


