దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసే ఎలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసే ఎలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంట్లో వ్యభిచారం చట్టబద్దత అంశంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ రాతపూర్వకంగాపై విధంగా సమాధానం ఇచ్చారు.
అయితే మహిళలు అక్రమ రవాణను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే లైంగికదాడికి గురవుతున్న మహిళలను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మేనకా గాంధీ ఈ సందర్బంగా సభకు వివరించారు.