మాస్క్‌ లేకుంటే నో పెట్రోల్‌...

No Mask No Fuel Rule At Odisha Petrol Pumps - Sakshi

భువనేశ్వర్‌ : కరోనా మహమ్మారి కట్టడికి ఇంటి నుంచి బయటకు వస్తే విధిగా మాస్క్‌ ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఒడిశాలోని పెట్రోల్‌ బంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మాస్క్‌ ధరించని వారికి వారి వాహనాల్లో పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ నింపబోమని స్పష్టం​ చేశాయి. మాస్క్‌ ధరించిన వారికే ఇంధనం నింపుతామని ఉత్కళ్‌ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ లత్‌ వెల్లడించారు. ఒడిశాలో మొత్తం 1600 పెట్రోల్‌ అవుట్‌లెట్లు ఉన్నాయని, ప్రభుత్వ మార్గదర్శకాలను అందరూ అనుసరించాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

పెట్రోల్‌ పంపుల వద్ద పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇన్ఫెక్షన్‌ భయం వెంటాడుతున్నా జీవనాధారం​ కోసం విధులకు హాజరవుతున్నారని అన్నారు. మాస్క్‌ వేసుకోవడం ద్వారా కస్టమర్లు, తమ ఉద్యోగులు ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ పొందుతారని ఆయన సూచించారు. కాగా, మాస్క్‌లు ధరించని వారికి కిరాణా, కూరగాయల విక్రేతలు సైతం ఎలాంటి వస్తువులను అమ్మడం లేదని అధికారులు పేర్కొన్నారు. చదవండి : కరోనా మృతులు లక్షలోపే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top