హజ్‌ యాత్ర అడ్డుకుంటాం.. | No Haj for Muslims if they create obstacles in construction of Ram Temple: BJP MLA | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్ర అడ్డుకుంటాం..

Jul 15 2017 4:15 PM | Updated on Sep 5 2017 4:06 PM

హజ్‌ యాత్ర అడ్డుకుంటాం..

హజ్‌ యాత్ర అడ్డుకుంటాం..

అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై రాజకీయ నేతలు తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

కాన్పూర్‌: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై రాజకీయ నేతలు తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గతంలో కేంద్రమంత్రి ఉమాభారతి సైతం రామ మందిరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడబోనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే . తాజాగా ఉత్తర ప్రదేశ్‌, ఛర్కారీ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్‌ రాజ్‌పుత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న వందకోట్ల మంది హిందువుల మనోభావాలను గౌరవించాలన్నారు. లేకపోతే వారి అభిప్రాయాలను గౌరవించేది లేదని స్పష్టం చేశారు.

రామమందిర నిర్మాణాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తే వారి హజ్‌ యాత్రలను అడ్డుకుంటామని సోషల్‌మీడియా ఫేస్‌బుక్‌ లైవ్‌లో తెలిపారు. ముస్లింల మైనారిటీ హోదాను ఉపసంహరించుకోవాలని, హజ్ యాత్రకు ఇచ్చిన రాయితీని రద్దు చేయాలి అని రాజపుత్ డిమాండ్ చేశారు. ఇది తన అభిప్రాయం కాదని వందకోట్ల హిందువుల అభిమతమని అన్నారు. ఫేస్‌బుక్‌లో తాను చేసిన వీడియోకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని రాజ్‌పుత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement