జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయం లో ఉన్న నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె అనితబోస్ కోరారు.
బోస్ కుమార్తె అనిత
న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయం లో ఉన్న నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె అనితబోస్ కోరారు. తద్వారా ఆ అస్థికలు తన తండ్రివో కాదో తేలుతుందన్నారు. తైపీలోని తైహోకు విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తానూ నమ్ముతున్నానన్నారు. జర్మనీలో ఉంటున్న ఆమె వచ్చే నెల భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు డీఎన్‌ఏ పరీక్ష గురించి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో అనిత వెల్లడించారు.