పార్కింగ్‌ స్థలం కోసం మహిళపై నటుడి దాడి | Nawazuddin Siddiqui booked for assaulting woman over parking space | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ స్థలం కోసం మహిళపై నటుడి దాడి

Jan 17 2016 9:03 PM | Updated on Apr 3 2019 6:23 PM

పార్కింగ్‌ స్థలం కోసం మహిళపై నటుడి దాడి - Sakshi

పార్కింగ్‌ స్థలం కోసం మహిళపై నటుడి దాడి

ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్కింగ్ స్థలం విషయమై ఆయన తనపై భౌతికంగా దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలోని యారి రోడ్డులో ఉన్న జోహ్రా అఘాది నగర్‌ హౌసింగ్‌ సొసైటీలో ఈ ఘటన జరిగింది. నవాజుద్దీన్‌తోపాటు ఫిర్యాదుదారు కూడా ఇదే సొసైటీలో నివాసం ఉంటున్నారు.

ఏడాది కిందట ఈ హౌసింగ్ సొసైటీలోకి మకాం మార్చిన నవాజుద్దీన్‌ సిద్దిఖీ పార్కింగ్ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించారని, ఈ విషయమై ఆదివారం మధ్యాహ్నం వాగ్వాదం జరుగడంతో అతను, అతని సోదరుడు, సిబ్బంది తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించి, తోసేశారని సొసైటీ చైర్మన్ సోనా దండేకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై దాడి, నేరపూరిత బలప్రయోగం) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement