ఫొనిపై ఒడిశా కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

ఫొనిపై ఒడిశా కీలక నిర్ణయం

Published Sat, May 18 2019 5:37 PM

Naveen Patnaik Prepares Massive Plantation Drive In Odisha - Sakshi

భువనేశ్వర్‌: ఫొని తుపాను సృష్టించిన వినాశనం నుంచి ఒడిశా ఇప్పడిప్పుడే కోలుకుంటుంది. గత నెల ఫొని వినాశనానికి రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. తుపాను దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యవరణం తీవ్రంగా దెబ్బతిన్నది. అనేక వృక్షాలు నేలకొరిగాయి. ఫొని ధాటికి దాదాపు 20 లక్షలకు పైగా వృక్షాలు కుప్పకూలినట్లు కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయన్‌ వెంటనే నష్ట నివారణ చర్యలను చేపట్టారు. పర్యవరణ పరిరక్షణ నిమిత్తం ఐదేళ్ల కాలానికి ప్రణాళికను ఏర్పాటు చేశారు.

ఫొని కారణంగా నష్టపోయిన వృక్ష సంపదను తిరిగి సాధించేందుకు రూ.188ను కేటాయించారు. ఆ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని ఏర్పాటుచేయనున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్‌, కటక్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటనున్నారు. ఫొను నష్టంపై శనివారం ఉన్నతాధికారులతో సమావేశమైన నవీన్‌ ఈ మేరకు అంచనాలను వేసి నష్టనివారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,780 హెక్టార్ల పంట నష్టం కూడా సంభవించింది. కాగా ఫొని తుపాను విరుచుకుపడినప్పుడు తన ప్రజలకు తక్షణ సహాయ సహకారాలను అందించడంలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తీసుకున్న చర్యలు యావద్దేశం ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement