వరుణ్‌తో డేటింగ్ వదంతే! | Nargis Fakhri Denies Dating Varun Dhawan | Sakshi
Sakshi News home page

వరుణ్‌తో డేటింగ్ వదంతే!

Aug 25 2014 11:33 PM | Updated on Sep 2 2017 12:26 PM

వరుణ్‌తో డేటింగ్ వదంతే!

వరుణ్‌తో డేటింగ్ వదంతే!

‘మై తేరా హీరో’ సహనటుడు వరుణ్ ధావన్‌తో డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలను నటి నర్గీస్ ఫఖ్రి తోసిపుచ్చింది.

 బెంగళూరు: ‘మై తేరా హీరో’ సహనటుడు వరుణ్ ధావన్‌తో డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలను నటి నర్గీస్ ఫఖ్రి తోసిపుచ్చింది. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధాలు లేవంది. ‘అలా మీడియాలో వార్తలు వచ్చాయా? నేను ఇంకా చదవలేదు. అసలు దాని గురించి నాకేమీ తెలియదు’ అంది. నగరంలో ఆదివారం జరిగిన మయంత్రా హెల్ప్‌లైన్‌ను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముగ్ధమనోహరి  మీడియా తీరుపై పరోక్షంగా మండిపడింది. ‘ఎటువంటి వాస్తవాలు లేకుండానే అటువంటి వార్తలు రాస్తారు. కనీసం ఒకసారి కూడా చూడని వ్యక్తితో తాను ఓ రాత్రంతా చిందులు వేసినట్టు రాస్తారు.

ఇదేమీ నేరం కాకపోయినా వారికి తోచినట్టు రాస్తుంటారు. భారతీయ యువకులు అమ్మాయిలతో డేటింగ్ చేసే సమయంలో చిత్రవిచిత్రంగా ఉండనవసరం లే దు. సృజనాత్మకంగా ఉంటే సరిపోతుంది. డేటింగ్ అంటే ఏమిటనేది ముందుగా వాళ్లు కచ్చితంగా తెలుసుకోవాలి. యువతుల నుంచి ఏమీ ఆశించకూడదు. సంభాషణలను సాగించవచ్చు’ అని అంది. న్యూయార్క్‌లో ఇటీవల ఓ వ్యక్తితో ఓ రోజు గడిపానంది. అతడు తనను హోటళ్లు, నైట్‌క్లబ్‌లకు తీసుకెళ్లాడని తెలిపింది. చివరికి తనను మళ్లీ ఇంటివద్ద విడిచిపెట్టాడంది.

అతను ఎవరో మీరు ఊహించగలరా అంటూ మీడియాను ప్రశ్నించింది. ఆ రోజు తనకు అత్యంత గుర్తుంచుకోదగ్గదని అంది. బాలీవుడ్‌లో మీ ప్రయాణం ఎలా సాగుతోందని అడగ్గా అంతా గందరగోళంగా ఉందంది. కుదుపులు ఎదురవుతున్నాయంది. అయితే జీవితం మాత్రం హాయిగా ఉందని, తానెంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement