మసీదుకు మోదీ పేరు! | Narendra Modi Name to Masjid in Karnataka Viral in Social Media | Sakshi
Sakshi News home page

మసీదుకు మోదీ పేరు!

Jun 22 2019 7:54 AM | Updated on Jun 22 2019 7:54 AM

Narendra Modi Name to Masjid in Karnataka Viral in Social Media - Sakshi

మోదీ పేరున్న బోర్డ్‌

యశవంతపుర : బెంగళూరు నగరంలో మోదీ పేరును మసీదుకు పెట్టారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా సామాజిక మాధ్యమాల్లో మాత్రం హల్‌చల్‌ చేస్తోంది. వివరాలు...ఇక్కడి శివాజీనగరలో 175 ఏళ్లు క్రితం దాత మోదీ అబ్దుల్‌ గఫూర్‌ పేరును మసీదుకు పెట్టారు. ఈ మసీదును ఇటీవల అధునికరణ పనులు చేశారు. మసీదుకు ఎడమవైపున మోదీ మసీదు అని పేరు రాశారు. కుడివైపున మోదీ ఫొటో ఉన్నట్లు వాటాప్‌లో వైరల్‌ అవుతుంది. వాస్తవంగా ప్రధాని నరేంద్రమోదీ పేరు అయితే కాదు. దాత మోదీ అబ్దుల్‌ గఫూర్‌ పేరును మసీదుకు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టినట్లు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయిన వాస్తవంగా దాత పేరును అలా రాశారు అంతే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement