కరోనా మనకు కొత్త పాఠాలు నేర్పింది: మోదీ | Narendra Modi Interacts With Sarpanchs via Video Conference | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

Apr 24 2020 11:24 AM | Updated on Apr 24 2020 12:12 PM

Narendra Modi Interacts With Sarpanchs via Video Conference - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వీయ నిర్భందంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండాలని ప్రధాని సూచించారు.ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, ఇతరులపై మనం ఆధారపడకూడదని, స్వయం సంవృద్థి సాధించాలని అన్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ శుక్రవారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన ఈ-గ్రామ స్వరాజ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ గ్రామాల్లో సుపరిపాలన కోసం పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కరోనా కట్టడికి తమవంతు కృషి చేస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. (లాక్డౌన్ ఉల్లంఘించిన వారికి కరోనా సినిమా)

పంచాయతీలకు ఇంటర్నెట్‌ సదుపాయం
స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ‍్యంపై చర్యలు చేపట్టాలని, అలాగే కరోనా వైరస్‌ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అలాగే పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని కోరారు. మెరుగైన పనితీరు కలిగిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పంచాయతీలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. (కరోనా : 24 గంటల్లో 1,684 కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement