ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం | Mumbai Fire Blaze At MTNL Building In Bandra | Sakshi
Sakshi News home page

ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

Jul 22 2019 6:22 PM | Updated on Jul 22 2019 6:50 PM

Mumbai Fire Blaze At MTNL Building In Bandra - Sakshi

సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాంద్రాలోని ఎంటీఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎగసిపడుతున్నాయి. బిల్డింగ్‌లో దాదాపు 100మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది 14 ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. లోపల చిక్కుకున్నవారి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. అగ్నిప్రమాదంలో 9 అంతస్తుల భవనం మొత్తం దట్టంగా పొగ కమ్మేసింది. మూడు, నాలుగు అంతస్తుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారి స్పందిస్తూ  కార్యాలయం మొత్తం పొగతో నిండిపోయిందని, కొందరు 10వ అంతస్తులో చిక్కుకుపోయారని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

  


 

Advertisement
 
Advertisement
Advertisement