‘గూఢచర్యం’లో ఎంపీ వ్యక్తిగత సహాయకుడి అరెస్టు | MP's personal assistant arrested in Spying | Sakshi
Sakshi News home page

‘గూఢచర్యం’లో ఎంపీ వ్యక్తిగత సహాయకుడి అరెస్టు

Oct 30 2016 12:59 AM | Updated on Sep 4 2017 6:41 PM

పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకి దేశ రక్షణ సమాచారాన్ని చేరవేస్తున్న కేసులో సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మునవర్ సలీమ్ వ్యక్తిగత

న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకి దేశ రక్షణ సమాచారాన్ని చేరవేస్తున్న కేసులో సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మునవర్ సలీమ్ వ్యక్తిగత సహాయకుడు(పీఏ) ఫర్హత్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం సలీమ్ నివాసంలో ఫర్హత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఫర్హత్‌కు ఐఎస్‌ఐతో 18 ఏళ్లుగా సంబంధాలున్నాయని, సమాచారం అందజేసినందుకు అతనికి రూ.20 వేలు ఇచ్చేవారని పోలీసులు చెప్పారు. 

ఫర్హత్ పేరును ఈ కేసులో సూత్రధారి, పాక హైకమిషన్ ఉద్యోగి మెహమూద్ అక్తర్ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. వార్తా చానళ్లలో ప్రసారమైన వీడియో వాంగ్మూలంలో ఫర్హత్‌తో పాటు సహోద్యోగులైన సయ్యద్, ఖాదిమ్, షాహిద్,  ఇక్బాల్  చీమా కూడా తనకు సహకరించినట్టు అక్తర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. పూర్తిగా విచారించిన తరువాతే ఫర్హత్‌ను పీఏగా నియమించుకున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సలీమ్ వెల్లడించారు. గతంలో మరికొంత మంది ఎంపీల వద్ద కూడా అతడు పనిచేశాడన్నారు. విచారణకు అన్ని విధాలా తాను సహకరిస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement