అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్‌

The most clean city indoor - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం గా ఇండోర్‌ గుర్తింపు తెచ్చుకుంది. 2018 సంవత్స రానికి గాను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో ఇండోర్‌ మొదటి స్థానంలో నిలిచిందని గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి చెప్పారు. దేశ వ్యాప్తంగా 4,200 నగరాల్లో చేపట్టిన సర్వేలో ఇండోర్‌ తర్వాతి స్థానాల్లో భోపాల్, చండీగఢ్‌ ఉన్నాయని తెలిపారు. గత ఏడాది 430 నగరాల్లో చేపట్టిన సర్వేలోనూ ఇండోర్‌కే మొదటి స్థానం దక్కిందన్నారు. అదేవిధంగా, పరిశుభ్రత పాటించే రాష్ట్రాల్లో జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top