మనుషులుగా మనం ఏం చేస్తున్నాం?!

Monkey Tries To Fix Leaking Pipe With Leaves In Viral Video - Sakshi

గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం... ఈ పంచభూతాలే మానవాళి మనుగడను నిర్దేశిస్తాయి. అయితే అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో పర్యావరణాన్ని కలుషితం చేయడానికి మనుషులు ఏమాత్రం వెనుకాడటం లేదు. పీల్చే గాలి మొదలు... తాగే నీటి వరకు అన్నింటినీ కాలుష్యానికి నెలవులుగా చేస్తూ భవిష్యత్‌ తరాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మరోవైపు తీవ్ర నీటి ఎద్దడి సమయంలోనూ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వృథా చేస్తున్నారు. జల సంరక్షణ అన్నదే పూర్తిగా మర్చిపోయారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే... మానవ జాతితో పాటు భూమి మీద నివసించే ప్రాణికోటి మొత్తం ఇబ్బందుల పాలుగాక తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా వారి మాటలను పట్టించుకోవడం లేదు.

అయితే, మనుషులకు బుద్ధిలేకపోయినా తాము మాత్రం అలా కాదు అంటున్నాయి వానరాలు. ‘మా జీవితాన్ని ఆనందమయం చేసిన ప్రకృతికి ఎప్పుడూ రుణపడి ఉంటాం’ అన్నట్టుగా ఓ కోతి చేసిన పని ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. యూనిసెఫ్‌ కార్యకర్త నిహారికా సింగ్ పంజేతా సోషల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోలో... పైపులైన్‌ నుంచి లీక్‌ అవుతున్న నీటిని వృథా కానీయకుండా ఓ ఓతి చేసిన పనిపై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. పైపు నుంచి ఉబికి వస్తున్న నీటిని ఆపేందుకు ఆ కోతి ఎండు ఆకులను అడ్డం పెట్టడం ఆలోచింపచేసేదిగా ఉందని అంటున్నారు. ‘నీటిని వృథా చేయకూడదనే గొప్ప ఆలోచన. మనుషులుగా మనం తప్పు చేసినా అందమైన ఈ ఆత్మలు.. అడవి బిడ్డలు మనకు గుణపాఠం చెబుతున్నాయి. వాటికి ఉన్న బుద్ధి, సున్నితత్వం మనకు లేకుండా పోయింది. సిగ్గుపడాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top