అందాల రాణి.. మోనికా గిల్ | Monica Gill from US is Miss India Worldwide 2014 | Sakshi
Sakshi News home page

అందాల రాణి.. మోనికా గిల్

Jun 21 2014 11:39 AM | Updated on Sep 2 2017 9:10 AM

అందాల రాణి.. మోనికా గిల్

అందాల రాణి.. మోనికా గిల్

మిస్ ఇండియా వరల్డ్వైడ్ 2014గా మిస్ ఇండియా యూఎస్ మోనికా గిల్ ఎంపికైంది.

మిస్ ఇండియా వరల్డ్వైడ్ 2014గా మిస్ ఇండియా యూఎస్ మోనికా గిల్ ఎంపికైంది. దుబాయ్లో వైభవంగా జరిగిన ఈ అందాల పోటీలో ఎన్నారై భామ కిరీటాన్ని అందుకుంది. రెండో స్థానంలో మిస్ ఇండియా స్విట్లర్లాండ్, మూడో స్థానంలో మిస్ ఇండియా బహ్రైన్ నిలిచారు. వివిధ దేశాల్లో ఉంటున్న భారత సంతతి యువతులలో అందగత్తెలను ఎంపిక చేసేందుకు ఈ పోటీ ప్రతియేటా నిర్వహిస్తారు. అలాగే ఈసారి 17 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 40 మంది యువతులు ఈ కిరీటం కోసం పోటీపడ్డారు. అబుదాబిలోని అల్ రహా బీచ్ రిసార్టులో ఫైనల్ పోటీలు జరిగాయి.

మిస్ ఇండియా వరల్డ్వైడ్ 2013 విజేత నేహల్ భగోటియా ఈసారి విజేతగా నిలిచిన గిల్కు కిరీటం అలంకరించింది. వినికిడిలోపం ఉన్నా కూడా.. ఈ పోటీలలో గెలిచి, తొలిసారి అందాల కిరీటాన్ని అందుకున్న బధిర యువతిగా గత సంవత్సరం నేహల్ చరిత్ర సృష్టించింది. ఈసారి ఆస్ట్రేలియ, అమెరికా, ఇంగ్లండ్, కెనడా, కెన్యా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రైన్, స్వీడన్, నెదర్లాండ్స్.. ఇలా పలు దేశాల నుంచి అందగత్తెలు దుబాయ్లో జరిగిన ఫైనల్స్లో పాల్గొన్నారు. విజేతకు దాదాపు 4.81 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు పలు రకాల బహుమతులు కూడా అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement