స్పీకర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఎమ్మెల్యే!

MLA Blows Flying Kiss To Speaker In Odisha Assembly - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యే తమ నియోజకవర్గ సమస్యలను సభలో వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన పని సభలోని అందరిచేత నవ్వుల పువ్వులు పూయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ ఎస్ఎన్ పాత్రోకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే, ఇందులో వేరే ఉద్దేశం లేదని, తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని ఈ రోజు సమయం ఇవ్వటంతో కృతజ్ఙతతోనే ఇలా చేశానని ఆయన తెలిపారు. మొత్తం 147మంది ఎమ్మెల్యేలు సభలో ఉండగా.. తనకే మొదట మాట్లాడే అవకాశం స్పీకర్ కల్పించారని అందుకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top