ఎమ్మెల్యేను.. నన్నే ప్రశ్నిస్తావా? | MLA attacks man for asking 'uncomfortable' questions | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను.. నన్నే ప్రశ్నిస్తావా?

Oct 2 2017 1:34 PM | Updated on Oct 2 2017 2:26 PM

MLA attacks man for asking 'uncomfortable' questions

సాక్షి, షిల్లాంగ్‌ : నేను ఒక ప్రజాప్రతినిధిని.. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను.. నన్నే అభివృద్ధి గురించి ఇంతమందిలో  ప్రశ్నిస్తావా? నీకెంత ధైర్యం.. అంటూ ఒక వ్యక్తిపై ఎమ్మెల్యే శ్యామ్యూల్‌ సంగ్మా.. పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మేఘాలయాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగ్మా.. ఎన్నికల సమయంలో నియోజవర్గం అభివృద్ధిపై పలు హామీలు గుప్పించాడు.. గెలిచిన తరువాత రెండేళ్లలో ఒక్కసారిగా కూడా నియోజకవర్గం ముఖం చూడలేదు. అయితే రెండు రోజులు కిందట ఒక పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సంగ్మాను ఫ్రీడమ్‌ మరాక్‌ అనే వ్యక్తి అభివృద్ధిపై ప్రశ్నలు సంధించాడు. ముఖ్యంగా గిరిజనులుకు సంబంధించి.. నువ్వేం చేశావు అని అడగ్గా.. ఆగ్రహించిన ఎమ్మెల్యే.. అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. దీనిపై స్పందించిన మరాక్‌.. వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మేల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement