అహ్మదాబాద్ లో అద్భుతం! | miracle in Ahmedabad | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్ లో అద్భుతం!

Jun 15 2016 8:21 AM | Updated on Aug 14 2018 3:22 PM

అహ్మదాబాద్ లో అద్భుతం! - Sakshi

అహ్మదాబాద్ లో అద్భుతం!

ఇద్దరు మిత్రులు రోడ్డు పక్కన టీ దుకాణం దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది.

అహ్మదాబాద్: ఇద్దరు మిత్రులు రోడ్డు పక్కన టీ దుకాణం దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది. వారిపైకి అనూహ్యంగా కారు దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే  వారిని కారు గుద్దేసింది. అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారు గుద్దేసిన వారికి ఏమైందోనని ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదం నుంచి వారిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడడం విశేషం.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కారులోని వ్యక్తి పొరపాటున యక్సిలేటర్‌ పెంచడంతో కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని చూసిన వారంతా 'మిరాకిల్' అని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement