మంత్రి భార్య, కుమార్తెకు కోవిడ్‌-19 | Ministers wife Daughter Test Covid-19 Positive | Sakshi
Sakshi News home page

కర్ణాటక మంత్రి భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌

Jun 23 2020 9:04 AM | Updated on Jun 23 2020 9:04 AM

 Ministers wife Daughter Test Covid-19 Positive - Sakshi

కర్ణాటక వైద్య విద్యా మంత్రి భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌

బెంగళూర్‌ : కర్ణాటక వైద్యవిద్యా శాఖ మంత్రి కే సుధాకర్‌ భార్య, కుమార్తెకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా మంత్రి తండ్రికి నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన మరుసటి రోజే వారికి పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్‌-19 టెస్ట్‌ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్‌ ఫలితాలు రావడం దురదృష్టకరమని మంగళవారం మంత్రి ట్వీట్‌ చేశారు.

ప్రసుత్తం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి సుధాకర్‌ పేర్కొన్నారు. తనకు తన ఇద్దరు కుమారులకు కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న సుధాకర్‌ తండ్రికి సోమవారం నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చదవండి : భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement