పదునెక్కిన మిగ్‌–29

MiG-29 gets upgrade - Sakshi

అదంపూర్‌ (జలంధర్‌): భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అమ్ములపొదిలో ఉన్న పాత ఎంఐజీ–29 యుద్ధ విమానం ఆధునిక యుద్ధా లకు తగ్గట్టుగా పదునెక్కింది. ఈ ప్రతిష్టాత్మక యుద్ధ విమనాలకు నూతన సాంకేతికత జోడించి పలు ప్రత్యేకతలతో అభివృద్ధి చేసినట్లు ఎయిర్‌ఫోర్స్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త ఎంఐజీ–29 యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలను గతవారమే అదం పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో విజయ వంతంగా పరీక్షించినట్లు అదంపూర్‌ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ కరన్‌ కోహ్లి పేర్కొన్నారు. సోమ వారం వైమానిక దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐఏఎఫ్‌కు ఇది తీపీ కబురే.

కొత్త ఎంఐజీ–29 ప్రత్యేకతలివీ...
► గాల్లోనే ఇంధనం నింపుకోవచ్చు.
► అత్యంత వేగంతో నిట్టనిలువుగా టేకాఫ్‌ తీసుకుని 5 నిమిషాల్లోనే క్షిపణులతో విరుచుకుపడి శత్రు విమానాన్ని ధ్వంసం చేయగలదు.
► పాత దానితో పోల్చితే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువును కూడా గుర్తించి సమర్థవంతంగా నాశనం చేయగలదు.
► దీనిలో ఉన్న మల్టీ ఫంక్షనల్‌ డిస్‌ప్లేలో ఏ వైపు నుంచి శత్రు విమానం వస్తుందో పైలట్‌ స్పష్టంగా కనబడుతుంది. దీంతో కావాల్సిన దిశలో పైలట్‌ క్షిపణులను ప్రయోగించగలడు.
► ఏ వైపు నుంచైనా క్షిపణులను ప్రయోగించగల సౌకర్యం దీనిలో ఉంది

ఎప్పుడొచ్చింది ఈ మిగ్‌–29..
ఈ ఎంఐజీ–29 యుద్ధవిమానాల్ని రష్యా తయారు చేస్తుంది. యుద్ధాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలనే వ్యూహంతో 1980ల్లోనే యుద్ధప్రాతి పదికన పాత ఎంఐజీ–29 యుద్ధ విమానా లను భారత్‌ కొనుగోలు చేసిందని, ఇవి అత్యవసర సమయాల్లో దేశాన్ని రక్షించ డంలో ముఖ్య భూమిక పోషించాయని ఓ అధికారి చెప్పారు. ఈ విమానాలే 1999 కార్గిల్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించా యన్నారు. ప్రభుత్వం 42 ఐఏఎఫ్‌ దళాలకు యుద్ధవిమానాలు మంజూరు చేసినా 31 దళాలకే విమానాలున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top