‘షార్‌’కు చేరుకున్న మైక్రోశాట్‌–ఆర్‌ ఉపగ్రహం | Microsat R Satellite Reached the SHAR | Sakshi
Sakshi News home page

‘షార్‌’కు చేరుకున్న మైక్రోశాట్‌–ఆర్‌ ఉపగ్రహం

Jan 14 2019 4:29 AM | Updated on Jan 14 2019 4:29 AM

Microsat R Satellite Reached the SHAR - Sakshi

శ్రీహరికోట(సూళ్లూరుపేట):  నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 24న నిర్వహించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ44 ప్రయోగానికి సంబంధించి మైక్రోశాట్‌–ఆర్‌ అనే ఉపగ్రహం ఆదివారం షార్‌కు చేరుకుంది.

బెంగళూరులోని యూఆర్‌ శాటిలైట్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం బయల్దేరిన ఈ ఉపగ్రహం ఆదివారం సాయంత్రానికి షార్‌కి చేరుకుంది.  మొదటి ప్రయోగవేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ44 రాకెట్‌ అనుసంధానానికి సంబంధించి నాలుగుదశల పనులను పూర్తి చేశారు. ఈ వారంలోనే రాకెట్‌ శిఖరభాగాన ఉపగ్రహాన్ని అమర్చేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement