ఫ్యాషన్‌ డిజైనర్‌ నుంచి ఫస్ట్‌ లేడీ

Melania Trump Is Fashion designer tO Us first lady - Sakshi

మెలానియా జర్నీ ఎంతో విభిన్నం  

అయిదు అడుగుల 11 అంగుళాల ఎత్తు, పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు, చురుగ్గా చూసే కళ్లు.. అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్‌. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఒకప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్, ఆ తర్వాత సూపర్‌ మోడల్‌. మోడలింగ్‌ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. ఆరు భాషల్లో మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్‌ బాగా వచ్చు. కానీ ఇంగ్లిష్‌  మాతృభాష కాకపోవడంతో తన యాక్సెంట్‌ని ఎక్కడ వెటకారం చేస్తారన్న బెరుకో, సహజంగానే మితభాషి అవడమో కానీ నలుగురులోకి వచ్చి మాట్లాడరు. ఆమె ప్రపంచం ఆమెదే. తను, తన కొడుకు బారన్‌లే ఆమెకు లోకం.  

కమ్యూనిస్టు దేశానికి చెందిన ఫస్ట్‌ లేడీ
స్లొవేనియాలో చిన్న పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1970 ఏప్రిల్‌ 26న మెలానియా జన్మించారు. తండ్రి విక్టర్‌ న్వాస్‌ కారు డీలర్‌. తల్లి అమలిజా పిల్లల బట్టల్ని డిజైన్‌ చేసేవారు. అలా ఆమెకి పుట్టుకతోనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడింది. 16వయేటే మోడలింగ్‌ రంగంలోకి వచ్చారు. ఇటలీలోని మిలాన్‌లో ఒక యాడ్‌ ఏజెన్సీకి మోడల్‌గా పని చేశారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చదువుతూ యూనివర్సిటీ చదువు మధ్యలో ఆపేశారు. మోడలింగ్‌ మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. 22 ఏళ్లు వచ్చాక మెలానియాకు కెరీర్‌లో బ్రేక్‌ వ చ్చింది. స్లొవేనియా మ్యాగజీన్‌ ‘జానా’లో ‘లుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకోలేదు. తాను వేసుకొనే డ్రెస్‌లను తానే డిజైన్‌ చేసుకునేవారు. 2000 ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్‌ ఫొటోలకు నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ఆ చిత్రాలు బయటికొచ్చి సంచలనమయ్యాయి.

ట్రంప్‌తో డేటింగ్, పెళ్లి
1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్‌తో ఒక పార్టీలో పరిచయమైంది. అప్పటికే రెండో భార్యతో విడాకులు తీసుకోవడానికి ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారు. కొన్నేళ్లు ట్రంప్‌తో డేటింగ్‌ చేశారు. 2005లో ట్రంప్‌తో వివాహమైంది. 2006లో మెలానియాకు కొడుకు బారన్‌ పుట్టాడు. ట్రంప్‌ తెంపరితనం, అమ్మాయిలు, వ్యవహారాలు, బహిరంగంగానే వారి పట్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ మెలానియాకు నచ్చినట్టు లేవు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మెలానియా మధ్యలోనే వదిలేశారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి మకాం మార్చినపుడూ ఆమె వెంట వెళ్లలేదు. నాడు న్యూయార్క్‌లో కొడుకు చదు వు కోసం ఉండిపోయారట. 2017లో కొడుకుతో కలసి వైట్‌హౌస్‌కు మారారు. వైట్‌హౌస్‌లో వారిద్దరి పడక గదులు వేర్వేరు అంతస్తుల్లో ఉండటం వంటి బెన్నెట్‌ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top