ఆసుపత్రిలో పెళ్లి | marriage in hospital | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో పెళ్లి

Jan 27 2014 3:30 AM | Updated on Sep 2 2017 3:02 AM

కల్యాణమండపంలో మంగళవాయిద్యాల మధ్య పెళ్లిచేసుకోవాల్సిన ఓ జంట ఆసుపత్రిలో రోగుల ఆర్తనాదాల మధ్య ఒక్కటవ్వాల్సి వచ్చింది.

 వడోదర: కల్యాణమండపంలో మంగళవాయిద్యాల మధ్య పెళ్లిచేసుకోవాల్సిన ఓ జంట ఆసుపత్రిలో రోగుల ఆర్తనాదాల మధ్య ఒక్కటవ్వాల్సి వచ్చింది. వడోదరకు చెందిన ఇర్ఫాన్ రిక్షావాఖాకు ముంబైకి చెందిన సమైయ్యాతో ఫిబ్రవరి 22న వివాహం కావాల్సి ఉంది. కానీ, ఇర్ఫాన్ తండ్రి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రి పాలయ్యాడు. చివరిఘడియల్లోనైనా తండ్రి కళ్లలో ఆనందం చూడాలని భావించిన ఇర్ఫాన్ గత శుక్రవారం తండ్రి చికిత్సపొందుతున్న ఆసుపత్రి వార్డులోనే సమైయ్యాను పెళ్లి చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement