కౌంటింగ్‌ రోజు భారీ ఉగ్రదాడికి స్కెచ్‌

Map Recovered From Dead Terrorist Reveals A Major Plot To Target IAF Air Bases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా ఉత్కంఠ రేపిన సార్వత్రిక సమరంలో విజేతలు ఎవరో తేలనున్న మే 23న అదును చూసి ఉగ్రదాడితో విరుచుకుపడాలని ఉగ్రమూకలు సంసిద్ధమైనట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు తమ టార్గెట్లుగా ఎంచుకున్న వాటిలో శ్రీనగర్‌, అవంతిపుర వైమానిక స్ధావరాలు ఉన్నట్టు సమాచారం.

సొపియాన్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల్లో ఒక మృతదేహం నుంచి ఓ స్కెచ్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీనగర్‌, అవంతిపుర ఎయిర్‌బేస్‌లపై దాడికి ఉగ్ర మూకలు ప్రణాళిక రూపొందించినట్టు ఈ స్కెచ్‌ వెల్లడించింది.

కాగా, ఈనెల 14న పుల్వామాలో ఉగ్ర కమాండర్ల భేటీలో హిజ్బుల్‌ ముజహిదీన్‌కు చెందిన రియాజ్‌ నైకూ, ఇద్దరు జైషే టెర్రరిస్టులు, లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్‌ దర్‌లు పాల్గొని భద్రతా, సాయుధ దళాలపై దాడికి వ్యూహం రూపొందించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. రంజాన్‌ మాసంలో ముఖ్యం‍గా ఓట్ల లెక్కింపు చేపట్టే మే 23న భారీ ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారని వెల్లడించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top