పౌరసత్వ చట్టం తేవాలి : అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్‌

Manmohan Singh Support CAA in 2003 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ గురువారం కీలక వీడియో విడుదల చేసింది. 2003లో రాజ్యసభలో కాంగ్రెస్‌ తరపున సభాపక్షనేతగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ పౌరసత్వ బిల్లు ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఈ చట్టంపై పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పిన మాటలనే అప్పట్లో మన్మోహన్‌ సింగ్‌ వెల్లడించారు. ఆ వీడియోలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హింసకు గురవుతున్న మైనార్టీలకు ఉదారభావంతో భారత పౌరసత్వం ఇవ్వాలని ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ వీడియోను విడుదల  చేయడం వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. ఒకరకంగా కాంగ్రెస్‌ పార్టీ ద్వంద వైఖరిని, ఓటు బ్యాంకు రాజకీయాలను దేశ ప్రజల ముందు ఆవిష్కరించినట్లైంది. ఈ వీడియోతో బంతి కాంగ్రెస్‌ కోర్టులో పడింది. మరి ఈ వీడియోపై ఆ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

చదవండి : (షాహి ఇమామ్‌ సంచలన వ్యాఖ్యలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top