కాకులకు నిత్యం రొట్టెల సేవ

Man Feeding Crows Daily In Karnataka - Sakshi

సిరుగుప్ప : పట్టణంలోని సదాశివనగర్‌లోని ప్రభుత్వ అతిథి గృహం పక్కన రోడ్డులో ఉన్న శ్రీవీరభద్రేశ్వర బాగలకోట హోటల్‌ యజమాని శివశంకర్‌గౌడ గత 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా కాకులకు రోజుకు మూడుసార్లు రొట్టెలను ఆహారంగా వేస్తూ, తాగునీటిని అందిస్తూ పశుపక్ష్యాదులకు మిత్రునిగా అభినందనలు అందుకుంటున్నారు. ప్రతిదినం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన కాకులకు తిండి నీరు అందజేస్తారు.  ప్రతి పూటా 10కి రొట్టెలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ప్రభుత్వ అతిథి మందిరం ప్రహరీ గోడపై వేస్తారు.

ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న కాకులు గుంపులు గుంపులుగా చేరి రొట్టె ముక్కలను అక్కడే తిని మరికొన్ని నోటితో కరచుకొని గూళ్లకు తీసుకుపోతాయి. ఇలా రోజు రూ.100లు కాకులకు ఆహారం కోసం ఖర్చు చేస్తున్నారు. కొన్ని సార్లు కోతులు, ఉడుతలు కూడా రొట్టెల సేవను అందుకుంటాయి. కాకులు అంటే కొందరికి అరిష్టం అని కొందరు మూఢ నమ్మకాలు కలిగిన ప్రజల మధ్య ప్రతి రోజూ గౌడ వాటి ఆకలి తీర్చడం విశేషం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top