Citizenship Amendment Act: Mamata Banerjee Questioned BJP on Demanding Birth Certificates - Sakshi
Sakshi News home page

పౌర బిల్లుపై దీదీ కీలక వ్యాఖ్యలు..

Dec 18 2019 3:25 PM | Updated on Dec 18 2019 4:35 PM

Mamata Banerjee Questioned Why The BJP Was Now Demanding Birth Certificates - Sakshi

పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ మరోసారి తేల్చిచెప్పారు.

కోల్‌కతా : దేశాన్ని విద్వేషాలతో తగులబెడుతున్నారని మోదీ సర్కార్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలను బెంగాల్‌లో అమలు చేయబోమని ఆమె తేల్చిచెప్పారు. బీజేపీ ఇప్పుడు బర్త్‌ సర్టిఫికెట్లను ఎందుకు అడుగుతోందని ప్రశ్నించారు. "ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని మీరు అంటున్నారు. కాని ఇప్పుడు మీరు పాన్ లేదు, ఆధార్ లేదు, ఏమీ పనిచేయదు అంటున్నారు..మరి ఏం పని చేస్తుంది? బీజేపీ నుంచి ఒక తాయత్తా’  అని ప్రశ్నించారు. ఒంటెద్దు పోకడలతో బీజేపీ వాషింగ్ మెషీన్‌గా మారింది" అని ఆమె వ్యాఖ్యానించారు.

అక్రమ వలసదారుల కోసం ఎన్ని శిబిరాలను నిర్మిస్తారని ఆమె హోంమంత్రి అమిత్‌ షాను ప్రశ్నించారు. అమిత్‌ షా కేవలం బీజేపీ నేత మాత్రమే కాదని దేశానికి హోంమంత్రి అని దేశంలో శాంతి భద్రతలను సవ్యంగా నిర్వహించండని హితవు పలికారు. మీరు అందరి అభివృద్ధికీ పనిచేయడం లేదని అందరి నాశనానికి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ ఉపసంహరించాలని, లేనిపక్షంలో వాటిని బెంగాల్‌లో ఎలా అమలు చేస్తారో తాను చూస్తానని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement