వివాదంలో ‘గృహలక్ష్మి’

Malayalam magazine cover showing breastfeeding woman goes viral, sparks outrage - Sakshi

కవర్‌పేజీపై అచ్ఛాదన లేకుండా చిన్నారికి పాలిచ్చే ఫొటో

తిరువనంతపురం: చిన్నారులకు బహిరంగ ప్రదేశాల్లోనూ పాలివ్వడంపై అవగాహన పెంచేందుకు కేరళకు చెందిన ఓ మేగజీన్‌ చేసిన ప్రయత్నం వివాదానికి దారితీసింది. ప్రముఖ మలయాళీ మీడియా సంస్థ మాతృభూమికి చెందిన గృహలక్ష్మి మేగజీన్‌ ‘తదేకంగా చూడకండి. చిన్నారులకు పాలివ్వాలి’ పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది.ఎదపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా చిన్నారికి పాలిస్తున్న ఓ మోడల్‌ ఫొటోను కవర్‌పేజీపై  ప్రచురించింది.

దీంతో మహిళల అసభ్య ప్రాతినిధ్య నిషేధ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నోబెల్‌ మాథ్యూ అనే న్యాయవాది మేగజీన్, మోడల్‌ గిలూ జోసెఫ్‌ కేసు వేశారు.ఈ ఘటనపై కేరళ బాలల హక్కుల కమిషన్‌కూ ఫిర్యాదు అందింది. కాగా, బహిరంగ ప్రదేశాల్లోనూ పాలివ్వడంపైఅవగాహన పెంచేందుకే కథనం ప్రచురించామని మాతృభూమి సంస్థ తెలిపింది. కేరళకు చెందిన అమృత (23)  చిన్నారికి పాలిస్తున్న ఫొటోను ఆమె భర్త బీజూ ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.  ఈ ఘటన స్ఫూర్తితో గృహలక్ష్మి తాజా కథనాన్ని ప్రచురించింది. మరోవైపు తనపై కేసు నమోదుకావడంపై మోడల్‌ గిలూ స్పందిస్తూ.. ఈ చిత్రాలను చిన్నారులకు ధైర్యంగా పాలిచ్చే తల్లులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top